epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ కీలక సమావేశం, పాలమూరుకు నీటి కేటాయింపులపై చర్చ

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తన ఫామ్ హౌస్‌లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీశ్ రావు, నిరంజన్ రెడ్డితో పాటు మరికొంత బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా పాలమూరుకు నీటి కేటాయింపులపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ‘తిరస్కరిస్తున్న’ తెలంగాణ రైతుల నీటి హక్కులను కాపాడటానికి కేసీఆర్ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కృష్ణా నీటి వాటా విషయంలో కాంగ్రెస్ రాజీ పడిందని కేసీఆర్ అన్నారు. “రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరించి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దెబ్బతీయడం తప్ప చేసిందేమి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది” అని బీఆర్ఎస్ (BRS) ఇప్పటికే పేర్కొంది.

నదుల అనుసంధాన ప్రాజెక్టుల ముసుగులో ఆంధ్రప్రదేశ్‌కు నీటి మళ్లింపుకు బీజేపీ (BJP) మద్దతు ఇస్తున్నందన తెలంగాణకు ప్రత్యక్ష ప్రజా పోరాటాలు మాత్రమే ఇప్పుడు ఏకైక మార్గమని కేసీఆర్ భావిస్తున్నారు. ఒకవైపు నీటి వాటాలపై ఏపీ ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుండగా, మరోవైపు కేసీఆర్(KCR) సమావేశం నిర్వహించడం ఆసక్తిగా మారింది.

Read Also: పేదింటి బిడ్ద‌ చ‌దువు కోసం ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>