సత్తుపల్లి ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్

కలం, సత్తుపల్లి :  సత్తుపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ(TGSRTC) కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల రద్దీ, అవసరాలను దృష్టిలో ఉంచుకుని సత్తుపల్లి–ఖమ్మం మార్గంలో నడిచే డీలక్స్ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ ఛార్జీలతోనే ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు సత్తుపల్లి డిపో (Sathupalli RTC Depot) మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. దీంతో ఇప్పటివరకు రూ.130గా ఉన్న డీలక్స్ ఛార్జీ రూ.120కి తగ్గనుంది. ఈ సదుపాయం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది.ఈ సదుపాయం కింద మొత్తం 10 డీలక్స్ బస్సులను నడపనున్నారు. ప్రతి 8 నిమిషాలకు ఒక బస్సు చొప్పున రోజూ 99 ట్రిప్పులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

ఖమ్మం రూట్‌తో పాటు ఇతర ప్రధాన మార్గాల్లోనూ ఆర్టీసీ (Sathupalli RTC Depot) సర్వీసులను పెంచింది. విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సును, అశ్వారావుపేట రూట్‌లో అదనంగా 6 ట్రిప్పులను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు, ఉద్యోగుల సౌకర్యార్థం సత్తుపల్లి–అంకంపాలెం రూట్‌లో సాయంత్రం 6 గంటలకు అదనపు ట్రిప్పును, ఏలూరుకు రెండు అదనపు సర్వీసులను ప్రారంభించారు. అదేవిధంగా సత్తుపల్లి నుంచి అంకంపాలెం, ములకలపల్లి, పొగళ్లపల్లి, బూర్గంపాడు మీదుగా భద్రాచలానికి నూతన ‘పల్లె వెలుగు’ బస్సును, లంకపల్లి, నీలాద్రి మీదుగా కొత్తగూడెంకు మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీ కల్పించిన ఈ సౌకర్యాలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ జి. రజిత పాల్గొన్నారు.

Also Read : బీఆర్​ఎస్​ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల : సీఎం రేవంత్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>