28 ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు

కలం, భైంసా: ముధోల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 28 ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Rama Rao) అధికారులను ఆదేశించారు. బుధవారం భైంసా పట్టణంలోని తన నివాసంలో ఇరిగేషన్ అధికారులతో 28 ప్యాకేజీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలిన పనులు, వాటికి అవసరమైన నిధులపై అధికారులతో చర్చించారు. గతంలో సుమారు 48 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులపై విభాగాల వారీగా అంచనాలు సిద్ధం చేసి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సూచించారు.

28 ప్యాకేజీ పూర్తయితే గోదావరి జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ముధోల్, తానూర్, కుభీర్ మండలాల్లోని పలు గ్రామాలకు అందించి సుమారు 50 వేల ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చని ఎమ్మెల్యే తెలిపారు. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కోరినట్లు గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ ప్రవీణ్, డీఈ నవీన్‌, అధికారులు పాల్గొన్నారు.

Also Read : రేవంత్ వ్యాఖ్యలపై పువ్వాడ అజయ్ తీవ్ర ఆగ్రహం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>