బీఆర్​ఎస్​ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల : సీఎం రేవంత్​

కలం, వెబ్​ డెస్క్​ : బీఆర్​ఎస్​ పదేళ్ల పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. బుధవారం సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. సిరిసిల్ల ప్రాంత చేనేత నైపుణ్యం అంతర్జాతీయ ఖ్యాతిని పొందిందన్నారు. చేనేత కార్మికులకు, వృత్తి నైపుణ్యానికి సిరిసిల్ల పెట్టింది పేరు అని కొనియాడారు.

సిరిసిల్ల (Sircilla) అంటే సిరులకు నిలయం కానీ పదేళ్లలో ఈ ప్రాంతం ఉరిసిల్ల(Urisilla)గా మారిందని.. సమస్యలకు నిలయంగా మార్చేశారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో 2009 ఎన్నికల్లో మహేందర్​ రెడ్డికి టికెట్​ ఇవ్వకుండా కేసీఆర్​ అమెరికా నుంచి కొడుకుని దింపారని రేవంత్​ రెడ్డి విమర్శించారు. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుందని సీఎం ఆరోపించారు.

Also Read : దేవుళ్లను విభజించే యత్నం సనాతన ధర్మానికే విరుద్ధం: బండి సంజయ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>