కలం వెబ్ డెస్క్ : తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల(Panchayat Elections) వేళ కొమురంభీం ఆసిఫాబాద్(Komaram Bheem Asifabad) జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల్లో ఓటమి భయంతో ఓ అభ్యర్థి (Sarpanch Candidate) పురుగుల మందు తాగి ఆత్మహత్య(suicide attempt)కు పాల్పడ్డాడు. కాగజ్ నగర్ మండలం రాస్పెల్లిలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన బొమ్మెల్ల రాజయ్య ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీలో ఉన్నాడు. అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో రాజయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు గమనించి రాజయ్యను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read Also: 20న సర్పంచ్‌లతో సీఎం రేవంత్ ఆత్మీయ సమావేశం
Follow Us On: Youtube


