Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు (Sanjay Jaju) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన్ను మూడు రోజుల కిందటే తెలంగాణకు రిలీవ్ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ఊహించినట్లుగానే సంజయ్ జాజును సీఎం రేవంత్ రెడ్డి కొత్త చీఫ్ సెక్రటరీగా ఎంపిక చేశారు. 1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు ఆయన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగానూ పనిచేశారు.

ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు మీ సేవ కేంద్రాలకు సంజయ్ జాజు (Sanjay Jaju) శ్రీకారం చుట్టి మంచి గుర్తింపు పొందారు. 2014లో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోయిన ఆయన సుదీర్ఘ కాలం తరువాత రాష్ట్రానికి వస్తూనే.. సీఎస్ కావడం గమనార్హం. ప్రస్తుత సీఎస్ ‌‌రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఈ నెల 30న రిటైర్ కానుండటంతో ఈ పదవి కోసం జయేశ్ రంజన్, వికాస్ రాజ్ వంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు పోటీ పడ్డారు. చివరికి ఆ అవకాశం సంజయ్ జాజును వరించింది.

Sanjay Jaju

Read Also: ‘రెడ్ జోన్’ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఈసారి వారికి టికెట్ డౌటే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>