Mobile Popup Ad
Mobile Popup Ad

ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవ ఏర్పాట్లు షురూ..!

క‌లం, వెబ్ డెస్క్: వినాయ‌క చ‌వితి వేడుక‌ల్లో భారీ గ‌ణ‌నాథుడి విగ్ర‌హాల‌తో దేశ‌ వ్యాప్తంగా ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించిన‌ ఖైర‌తాబాద్ బ‌డా గ‌ణేష్ (Khairatabad Ganesh) వేడుక‌లు శుక్ర‌వారం అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఉత్స‌వ క‌మిటీ స‌భ్యులు క‌ర్ర‌పూజ నిర్వ‌హించి విగ్ర‌హ నిర్మాణ ప‌నులు ప్రారంభించారు. ఈ ఏడాది ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు పంచ‌ముఖ సంక‌ట‌హ‌ర మ‌హా గ‌ణ‌ప‌తిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. ఈ మేర‌కు ఉత్స‌వ క‌మిటీ స‌భ్యులు గురువారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ ఏడాదితో ఖైర‌తాబాద్ గ‌ణేస్ ఉత్స‌వాలు 72 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

అలాగే ఇందులోనే విగ్ర‌హ న‌మూనా, ఎత్తు వివ‌రాలు వెల్ల‌డించారు. విగ్ర‌హం 69 అడుగుల ఎత్తుతో, ఓవైపు సోమ‌నాథ్ జ్యోతిర్లింగం, మ‌రోవైపు కాళీమాత విగ్ర‌హంతో ఖైర‌తాబాద్ గ‌ణేష్ (Khairatabad Ganesh) ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ప్ర‌తి ఏటా సుమారు రెండు నెల‌ల ముందే విగ్ర‌హ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 14న వినాయ‌క చ‌వితి జ‌రుగ‌నుంది. ఇక క‌ర్ర‌పూజ కార్య‌క్ర‌మానికి భ‌క్తులు భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. జై బోలో గ‌ణేష్ మ‌హారాజ్ కీ అంటూ ఉత్సాహంగా వేడుక నిర్వ‌హించారు.

Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>