Mobile Popup Ad
Mobile Popup Ad

అక్రమ రిజిస్ట్రేషన్ బాధతో రైతు ఆత్మహత్య

కలం మెదక్ బ్యూరో: అక్రమ రిజిస్ట్రేషన్ కారణంగా రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సంగారెడ్డి (Sangareddy) చోటుచేసుకుంది. కంగ్టి మండలం గాజుల్పాడ్ గ్రామానికి చెందిన మాధవరావు (62)కు 9 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని మాధవరావుకు తెలియకుండానే ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో తన భూమిని తిరిగి తన పేరుపై మార్చుకునేందుకు మాధవరావు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరిగాడు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాధవరావు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ దుర్గారెడ్డి తెలిపారు.

Read Also: బోగస్ ఉద్యోగుల ఏరివేతకు సర్కార్ ప్లాన్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>