గుజరాత్ ప్లేయర్స్ కన్నా నేను బాగా ఆడతా: శ్రీకాంత్

కలం, స్పోర్ట్స్: గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాటర్లపై టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణామాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikanth) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్ మిడిల్ ఆర్డర్ కంటే ఈ వయసులో కూడా తాను బాగా ఆడతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 200 పరుగుల ఛేదనలో గిల్, సాయి సుదర్శన్, బట్లర్‌లతో కూడిన టాప్ ఆర్డర్ కేవలం 19 పరుగులకే నిష్క్రమించడంతో గుజరాత్ 100 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ జట్టు కేవలం తన టాప్-3 బ్యాటర్లపైనే ఆధారపడుతోందని, వారు అవుటైతే ఆట ముగిసినట్లేనని శ్రీకాంత్ విశ్లేషించారు. తన వయసులో కూడా ఆ మిడిలార్డర్ ఆటగాళ్ల కంటే మెరుగ్గా ఆడగలనని ఆయన ఎద్దేవా చేశారు. గ్లెన్ ఫిలిప్స్ కేవలం ఫీల్డర్‌గా మాత్రమే జట్టులో ఉన్నాడని, ఐపీఎల్‌లో అతని రికార్డులు ఏమాత్రం బాగోలేవని మండిపడ్డారు. నాలుగో స్థానం నుంచే గుజరాత్ బ్యాటింగ్ లైనప్ తోకముడిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా బ్యాటింగ్‌ను ఆయన తప్పుబట్టారు. షారుఖ్ ఖాన్ ఏదో ఒక సిక్స్ కొడితే జనం హైప్ ఇస్తున్నారని, కానీ వాస్తవానికి అక్కడ విషయం లేదని పేర్కొన్నారు. టాప్-3ని అడ్డు పెట్టుకుని ప్రత్యర్థులను భయపెట్టే రోజులు పోయాయని, నాణ్యమైన మిడిలార్డర్ లేకపోతే భవిష్యత్తులో కష్టమని హెచ్చరించారు. వెంటనే గ్లెన్ ఫిలిప్స్‌ను జట్టు నుంచి తొలగించి, జేసన్ హోల్డర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని శ్రీకాంత్ (Srikanth) సూచించారు. హోల్డర్ బ్యాటింగ్, బౌలింగ్‌లో ఫిలిప్స్ కంటే మెరుగైన ప్రభావం చూపగలడని అభిప్రాయపడ్డారు. 7 కోట్లు పెట్టి కొన్న హోల్డర్‌కు ఇప్పటివరకు అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. గుజరాత్ జట్టు మేనేజ్‌మెంట్ ఈ విమర్శలను ఎలా తీసుకుంటుందో చూడాలి.

Read Also: పాత చింతకాయ పచ్చడిలా.. కేసీఆర్ ప్రసంగం: ఎమ్మెల్యే వేముల

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>