Mobile Popup Ad
Mobile Popup Ad

సర్పంచ్‌కే సైబర్ షాక్: రూ.4 లక్షలు స్వాహా !

కలం, మెదక్ బ్యూరో: సామాన్యులనే కాదు, ప్రజాప్రతినిధులను కూడా సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. భారీ లోన్, కారు గిఫ్ట్ గా ఇస్తామంటూ నమ్మించి ఒక గ్రామ సర్పంచ్‌కే టోకరా వేశారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లా కల్హేర్ మండలంలో ఈ ఘటన వెలుగుచూసింది. సర్పంచ్ నుంచి విడతలవారీగా రూ. 4 లక్షల 12 వేల రూపాయలను సైబర్ కేటుగాళ్లు కాజేశారు.

బాధితునికి ఫోన్ చేసిన నేరగాళ్లు రూ. 80 లక్షల లోన్, ఒక కారు గిఫ్ట్ గా ఇస్తామని నమ్మించారు. అందుకోసం కొన్ని నకిలీ పత్రాలను వాట్సాప్ లో పంపించారు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ చెల్లించాలని కోరడంతో సర్పంచ్ మొదట రూ. 20 వేలు పంపించారు. ఆ తర్వాత సీబీఐ, ఇన్ కమ్ ట్యాక్స్ అనుమతుల పేరుతో భయపెట్టి మరో రూ. 3.92 లక్షలను తమ అకౌంట్ లో వేయించుకున్నారు. అక్కడితో ఆగని కేటుగాళ్లు.. ఇంకా డబ్బులు పంపకుంటే సీబీఐ అరెస్ట్ చేస్తుందని సర్పంచ్ ని బెదిరించడం ప్రారంభించారు. దీంతో తాను ఘోరంగా మోసపోయానని గ్రహించిన సర్పంచ్, వెంటనే కల్హేర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>