కలం, వెబ్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ (The Paradise) మూవీపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి తాజాగా సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన పాత్ర పేరు బిర్యానీ అని పరిచయం చేశారు. అసలు గుర్తు పట్టలేకుండా ఉన్నాడు సంపూర్ణేష్ బాబు. జుంపాలు పెంచుకుని చేతిలో కత్తి పట్టుకుని బీడీ తాగుతూ ఊరమాస్ లుక్ లో ఉన్నాడు. ఇందులో కొంచెం సన్నబడ్డట్టు కనిపిస్తున్నాడు సంపూర్ణేష్ బాబు. ఇప్పటి వరకు ఆయన కామెడీ రోల్స్ మాత్రమే చేశాడు. కానీ ఫస్ట్ టైమ్ చాలా సీరియస్ పాత్ర చేస్తున్నట్టు కనిపిస్తోంది ఈ లుక్ చూస్తుంటే. ది ప్యారడైజ్ (The Paradise) నుంచి వరుసగా నటుల పోస్టర్లు రిలీజ్ అవుతుండటంతో నాని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. అందరి లుక్స్ చాలా డిఫరరెంట్ గా కనిపిస్తున్నాయి. ఈ సినిమా 26 మార్చి 2026న రిలీజ్ కాబోతోంది.
Read Also: చీరలోనే నాకు కంఫర్ట్.. వెడ్డింగ్ శారీపై అలియా ముచ్చట్లు
Follow Us On: X(Twitter)


