కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ అందమైన హీరోయిన్లలో అలియా భట్ (Alia Bhatt) ఒకరు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఈ బ్యూటీ అందమైన చీరకట్టుతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది. మోడ్రన్ దుస్తులున్నా.. చీరకట్టుకు ప్రాధాన్యమిస్తుంది. అలియా 2022న ఏప్రిల్ 14న ముంబైలో సన్నిహితుల సమక్షంలో రణబీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. సాంప్రదాయానికి భిన్నంగా తనకు మాత్రమే మ్యాచ్ అయే పాస్టెల్-టోన్ ఎంబ్రాయిడరీ ఆర్గాన్జా చీరలో మెరిసిపోయింది. దీంతో అలియా పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చీరకట్టులో గ్రాండ్ లుక్స్‌తో ఆకట్టుకుంది. తాజాగా తన వెడ్డింగ్ దుస్తులపై ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
“నాకు చీరలోనే కంఫర్టబుల్‌గా ఉంటుంది. నేను మొదటిసారి ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీకి కాల్ చేసినప్పుడు, ‘నువ్వు ఏమి ధరించాలనుకుంటున్నావు’ అని అడిగాడు. ‘నేను కంఫర్టబుల్‌గా ఉండాలనుకుంటున్నా. చీరనే ధరించాలనుకుంటున్నా’ అని చెప్పింది. తెలుపు, బంగారు రంగులో వెడ్డింగ్ శారీ (Saree) కావాలని అడగడంతో అందుకు డిజైనర్ ఆర్గాన్జా చీరను ప్రత్యేకంగా తయారుచేశారు. ఎందుకంటే ఇది చాలా కంపర్టబుల్‌గా, గ్రాండ్‌గానూ అనిపించింది.‘‘ అని అలియా భట్ గుర్తుచేసుకున్నారు.
పెళ్లి(Wedding)లో ఎర్రబడిన బుగ్గలు, అందమైన పెదాలు, ఆకట్టుకునే కనురెప్పలు, ఉంగరాల జుట్టు, తక్కువ మేకప్‌తో అందర్నీ ఆకట్టుకుంది అలియా. అలాగే అందమైన అన్‌కట్ డైమండ్ జువెలరీ సెట్ అలియాను ప్రత్యేకంగా కనిపించేలా చేసింది.


