కలం, సినిమా : స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మా ఇంటి బంగారం” (Maa Inti Bangaram). ఈ సినిమా ఇంట్రెస్టింగ్ టీజర్‌ను ఈరోజు మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో సమంత యాక్షన్ మోడ్‌లో అదరగొట్టింది. అమాయకంగా కనిపిస్తూనే అదిరే యాక్షన్ ఎపిసోడ్స్‌తో సమంతా ఎంతగానో మెప్పించింది. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. జీవిత భాగస్వామితో అత్తవారింటికి వచ్చిన సమంత అక్కడ అమాయకంగా కనిపించి ఇంట్లో వాళ్లను ఆకట్టుకుంటూనే.. మరోవైపు వారికి షాక్ ఇచ్చేలా ఫైట్స్ చేస్తుంటుంది. ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో అత్తింటి వారికి అర్థం కాదు. అసలు సమంత ఎందుకు ఈ పోరాటాలు చేస్తోంది అనేది సినిమాపై ఆసక్తి కలిగిస్తుంది.
‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని తన ట్రలాలా పిక్చర్స్ బ్యానర్ పై సమంత నిర్మిస్తోంది. అయితే ప్రొడ్యూసర్ గా సమంతకు ఇది రెండో సినిమా. దర్శకురాలు నందిని రెడ్డి (B.V. Nandini Reddy) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆమె సమంతను తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ టీజర్ చూస్తేనే తెలుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా రిలీజ్ డేట్ ను మాత్రం ఈ టీజర్ లో అనౌన్స్ చేయలేదు. కాస్టింగ్ పరంగా చూస్తే గౌతమి, శ్రీలక్ష్మి, శ్రీముఖి వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah) మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ వీడియో చివరలో క్రియేటెడ్ బై రాజ్ నిడుమోరు (Raj Nidimoru) అని క్రెడిట్ ఇచ్చారు. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ హనీ బన్నీ మూవీస్‌లో సమంత (Samantha) ప్రాక్టీస్ చేసి పర్ఫార్మ్ చేసిన యాక్షన్, స్టంట్స్ అన్నీ ఈ మూవీకి బాగా పనికొచ్చినట్లు తెలుస్తుంది.
Read Also: సినిమా టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
Follow Us On : WhatsApp


