కలం వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ (Raja Saab) సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. ఏ థియేటర్ దగ్గర చూసినా రెబల్ ఫ్యాన్స్ సందడి కనిపిస్తోంది. పండగలా తమ హీరో సినిమాను రెబల్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏపీ తెలంగాణలోని అన్ని ఏరియాల్లో ఇదే సందడి కనిపిస్తోంది. నిన్న రాత్రి తెలంగాణలో ప్రీమియర్స్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వెంటనే బుకింగ్స్ భారీగా జరిగాయి. రాత్రి 10 గంటల తర్వాత థియేటర్స్ దగ్గరకు అభిమానులు చేరుకున్నారు. ఈ సినిమాలో చూపించినట్లు మొసలి బొమ్మలతో ఫ్యాన్స్ రాజా సాబ్ సినిమాను చూశారు.
మరోవైపు సోషల్ మీడియా మొత్తం రాజా సాబ్ తో నిండిపోతోంది. ఈ సినిమా గురించి తమ తమ అభిప్రాయాలు చెబుతూ వందలాది పోస్టులు కనిపిస్తున్నాయి. థియేటర్స్ దగ్గర క్యాప్చర్ చేసిన ఫొటోస్, వీడియోస్ తో పాటు థియేటర్ లో హీరో ఎంట్రీ సీన్, ఫైట్ సీన్ లాంటి స్పాయిలర్స్ కూడా నెటిజన్స్ పోస్టులు చేస్తున్నారు. ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ సినిమాతో ఒక కొత్త తరహా జానర్ ట్రై చేశాడని, ఆయన పర్ ఫార్మెన్స్ చాలా బాగుందనే అంతా అంటున్నారు.
ఇక రేపటి నుంచి వీకెండ్ తో పాటు సంక్రాంతి హాలీడేస్ వస్తున్నాయి. దాంతో రాజా సాబ్ మూవీని ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా చూడబోతున్నారు. ఈ సినిమాలోని ఫాంటసీ ఎలిమెంట్స్ పిల్లలకు బాగా నచ్చుతాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పినట్లు డే 1 వసూళ్లలో రాజా సాబ్ 100 కోట్ల రూపాయల మార్క్ టచ్ అవుతాడా లేదా అనేది చూడాలి. ఓవరాల్ గా ఓపెనింగ్స్ మాత్రం రాజా సాబ్ (Raja Saab) కు భారీ ఎత్తున ఉండబోతున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also: ఆస్కార్‌కు అడుగు దూరంలో మహావతార్ నరసింహా, కాంతార
Follow Us On: X(Twitter)


