కలం, వెబ్ డెస్క్: ఈవెంట్లు, ప్రమోషన్లు లాంటి కార్యక్రమాలకు హాజరయ్యే నటీనటులకు చేదు అనుభవం తప్పడం లేదు. బౌన్సర్లు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నా.. అభిమానులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఏమాత్రం అవకాశం దొరికినా చుట్టుముట్టేసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అభిమానం పేరుతో కొందరైతే యాక్టర్లని తాకరాని చోట తాకుతున్నారు. ఇటీవల నిధి అగర్వాల్ ఘటన మరువకముందే.. సమంత (Samantha)కి చేదు అనుభవం ఎదురైన వీడియో బయటకొచ్చింది.
టాలీవుడ్ (Tollywood) నటి సమంత ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైంది. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమం తర్వాత సమంత (Samantha) బయటకు రాగానే అభిమానులు చుట్టిముట్టారు. ఆమెను తాకేందుకు కొందరు ప్రయత్నించడంతో అతి కష్టం మీద బౌన్సర్లు సమంతను తీసుకెళ్లారు. అభిమానుల తాకిడితో సమంత అసౌకర్యానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే హీరోయిన్ నిధి అగర్వాల్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది.
Read Also: చిరు, శ్రీకాంత్ మూవీ ఎప్పుడు..?
Follow Us On: X(Twitter)


