Mobile Popup Ad
Mobile Popup Ad

రెస్టారెంట్ పెట్టిన స‌ల్మాన్ ఖాన్ చెల్లెలు.. ధ‌ర‌లు చూస్తే షాక‌వ్వాల్సిందే!

క‌లం, వెబ్‌డెస్క్‌: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) సోదరి అర్పితా ఖాన్ (Arpita Khan) ముంబైలోని శాంతాక్రజ్‌లో ‘మెర్సీ’ పేరుతో ఒక ల‌గ్జ‌రీ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఈ రెస్టారెంట్‌లోని వంటకాల కంటే అక్కడ మెనూలో ఉన్న ధరలే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణ రెస్టారెంట్లలో కొన్ని వందల రూపాయల్లో లభించే పాస్తా ఇక్కడ ఏకంగా రూ.8,500 పలుకుతుండటం విశేషం. కేవలం పాస్తానే కాదు లాంబ్ వంటకాల ధర రూ.10,000 వరకు ఉండగా కొన్ని షాంపేన్ బాటిళ్ల ధర ఏకంగా రూ.2 లక్షల వరకు ఉంది. అత్యంత ఖరీదైన యూరోపియన్ వంటకాలు, రాజసం ఉట్టిపడే ఇంటీరియర్‌తో ఈ రెస్టారెంట్ రిచ్ పీపుల్‌కి పర్ఫెక్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది.

అర్పితా ఖాన్‌కు (Arpita Khan) హైదరాబాద్‌తో ఒక ప్రత్యేక అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. 2014లో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆమె వివాహం ఆయుష్ శర్మతో అత్యంత వైభవంగా జరిగింది. అప్పట్లో ఆ రాయల్ వెడ్డింగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆమె ప్రారంభించిన ఈ ఖరీదైన రెస్టారెంట్ కూడా అదే స్థాయిలో చర్చకు దారితీస్తోంది. సినిమా స్టార్లు, బిజినెస్ మ్యాన్లు త‌ప్ప సామాన్యులు ఈ రెస్టారెంట్‌లో ఏం తిన‌లేరంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

Read Also: రీల్స్ పిచ్చిపై బీసీసీఐ సీరియస్.. కొత్త రూల్స్ ఇవే!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>