సైనికుల సేవకు సెల్యూట్.. రైతులకు ఘన సత్కారం

కలం, నిజామాబాద్ బ్యూరో: ‘జై జవాన్.. జై కిసాన్’ నినాద స్ఫూర్తితో దేశ రక్షణలో సేవలందిస్తున్న సైనికులను, దేశానికి అన్నం పెట్టే రైతులను సన్మానించి వారి సేవలను గుర్తించడం గొప్ప బాధ్యతగా భావిస్తున్నట్లు టీఎంఆర్ ఫౌండేషన్ (TMR Foundation) చైర్మన్ తాటి వీరేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌లో (Nizamabad) ‘సైనికులకు వందనం.. రైతులకు నీరాజనం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఇప్పటివరకు టీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 98 మంది సైనికులు, 98 మంది రైతులను సన్మానించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్‌లో భారత సైనికుడిగా 18 ఏళ్లపాటు విశేష సేవలందించిన నల్లగట్ల సత్యనారాయణ చార్యను ఘనంగా సన్మానించారు. ఫౌండేషన్ తరఫున ఆయనకు మెమెంటో అందజేశారు. కార్యక్రమానికి స్నేహ సొసైటీ సెక్రటరీ ఎస్. సిద్దయ్య, ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, రాజేశ్వరి, సోషల్ వర్కర్ చల్ల గంగాధర్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎస్. సిద్దయ్య మాట్లాడుతూ దేశ రక్షణ కోసం అహర్నిశలు సేవలందిస్తున్న సైనికులను సన్మానించడం మనందరి బాధ్యత అని అన్నారు. వారి సేవలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సరిహద్దులలో సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ కల్పిస్తుంటే.. రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించి సమాజానికి ఆహారాన్ని అందిస్తున్నారని కొనియాడారు. సైనికులు, రైతుల సేవలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు.

టీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ తాటి వీరేశం మాట్లాడుతూ ఇప్పటివరకు తమ సంస్థ ఆధ్వర్యంలో 98 మంది సైనికులు, 98 మంది రైతులను సన్మానించినట్లు తెలిపారు. సమాజంలో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు సైనికులు, రైతుల సేవలకు గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో ‘జై జవాన్.. జై కిసాన్’ నినాద స్ఫూర్తితో ‘సైనికులకు వందనం.. రైతులకు నీరాజనం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>