కలం, వెబ్ డెస్క్ : ఆషాఢ మాస బోనాల (Ashada Bonalu) ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ప్రముఖ దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ చేయనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రముఖ ఆలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించే నాయకులు
ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మీరాలం మండి మహంకాళి ఆలయంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్టు వస్త్రాలు అందిస్తారు. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి వస్త్రాలు సమర్పిస్తారు.
కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ, సుల్తాన్‌షాహి బంగారు మైసమ్మ ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొంటారు. చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంబర్‌పేట మహంకాళి ఆలయంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క సమర్పిస్తారు.
సబ్జీ మండి నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాంబక్షబండ బంగారు మైసమ్మ ఆలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, భేలా ముత్యాలమ్మ ఆలయంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, సుల్తాన్‌షాహి జగదాంబ ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గౌలిపూర మహంకాళి ఆలయంలో మంత్రి వాకిటి శ్రీహరి పట్టు వస్త్రాలు అందజేస్తారు.
హరిబౌలి నల్ల పోచమ్మ ఆలయంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, హరిబౌలి బంగారు మైసమ్మ ఆలయంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, బోయిగూడ బంగారు మైసమ్మ ఆలయంలో కె. కేశవరావు, అద్దంకి దయాకర్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. నాచారం మహంకాళి ఆలయంలో పి. సుదర్శన్ రెడ్డి, గౌలిగూడ మహంకాళి ఆలయంలో హర్కర వేణుగోపాల్ రావు, ఎల్‌బీనగర్ ఖిల్లా మైసమ్మ ఆలయంలో పొచారం శ్రీనివాస్ రెడ్డి, ఆది శ్రీనివాస్ పాల్గొంటారు.
అలీజాకోట మహంకాళి ఆలయంలో విజయ రమణారావు, మూసీ బ్రిడ్జి భూలక్ష్మి ఆలయంలో పట్నం మహేందర్ రెడ్డి, నట్రాజ్ నగర్ మహంకాళి ఆలయంలో బాల్మూరి వెంకట్, అలియాబాద్ దర్బార్ మైసమ్మ ఆలయంలో జాతోత్ రామ్‌చందర్ నాయక్ పాల్గొంటారు. మురాద్ మహల్ నల్ల పోచమ్మ ఆలయంలో డాక్టర్ బండా ప్రకాశ్, సీబీఐ క్వార్టర్స్ నల్ల పోచమ్మ ఆలయంలో ఎం. అనిల్ కుమార్ యాదవ్, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేస్తారు.

