‘నేపాలీ పని మనుషులతో జాగ్రత్త’.. సజ్జనార్ హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్: నేపాల్ పని మనుషులతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar) హెచ్చరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజా రంజన్ దారుణ హత్యకు గురి కాగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్పన అనే నేపాల్‌కు చెందిన మహిళ మరికొందరితో కలిసి హత్యకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. తనూజా రంజన్ చేతులు కట్టేసి, నోట్లో గుడ్డ కుక్కి చంపేశారని వెల్లడించారు. వినయ్ రంజన్ రే తల్లికి సపర్యలు చేసేందుకు కల్పన ఏడాది కిందట ఇంట్లో పనిమనిషిగా చేరిందని, ఆమె చనిపోయిన తరువాత కూడా తొలగించకుండా కొనసాగించారని సీపీ వివరించారు.

అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు..

నేపాల్ పని మనుషులతో జాగ్రత్తగా ఉండాలని తాము ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నామని సీపీ సజ్జనార్ తెలిపారు. వారు బాగా పని చేస్తున్నట్లు నటిస్తూనే.. అవకాశం కోసం ఎదురు చూస్తుంటారని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో బెంగళూర్, ముంబయి నగరాల్లో కూడా నేపాలీ పనిమనుషులు హత్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఇప్పటి నుంచైనా అలాంటి వారిని వెంటనే పనుల్లో నుంచి తొలగించుకోవడం మేలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>