ప్రియుడితో జంప్.. పోలీసుల ముందే భార్యను కడతేర్చిన భర్త

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో (Zaheerabad) ఆదివారం దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భర్త సిద్ధా రెడ్డి.. తన భార్య కవిత (29)ను ఘోరంగా హత్య (Husband Kills Wife) చేశాడు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని కోపంతో ఊగిపోయిన సిద్దా రెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే తన భార్య కవితకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అతడితోనే తన జీవితాన్ని కొనసాగించాలని భావించి భర్తను వదిలిపెట్టి మార్చి 27న కవిత తన ప్రియుడితో వెళ్లిపోయింది. కవిత ఇంటికి రాకపోవడాన్ని గమనించిన భర్త..  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జహీరాబాద్​ పోలీసులు మార్చి 30న అదృశ్యం కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జడ్చర్లలో ప్రియుడు పవన్‌తో కవిత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

విషయం తెలుసుకున్న భర్త సిద్ధారెడ్డి.. కవితను జహీరాబాద్ తీసుకొచ్చేందుకు పోలీసులతో కలిసి వెళ్లారు. జడ్చర చేరుకున్నాక పోలీసులకు తెలియకుండా సిద్ధారెడ్డి అక్కడే ఓ కత్తి కొనుగోలు చేశాడు. జహీరాబాద్ వస్తున్న మార్గమధ్యలో పోలీసులు కారులో ఉండగానే సదాశివపేట మండలం నందికంది వద్దకు రాగానే కత్తితో కవితని గొంతులో పొడిచి హత్య (Husband Kills Wife) చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా కవిత మృతువుతో పోరాడి చనిపోయింది.  కవిత మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. నిందితుడు సిద్దా రెడ్డి పోలీసులు అదుపులోనే ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: బెంగుళూరు నుంచి హైద‌రాబాద్‌కు ఊపిరితిత్తులు.. స‌జ్జ‌నార్ అల‌ర్ట్‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>