ఏపీ పోలీసుల‌పై స‌జ్జ‌ల ఘాటు వ్యాఖ్య‌లు

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ పోలీసుల‌పై, లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తీరుపై వైసీపీ స్టేట్ కో ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. పోలీసులు తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స‌జ్జ‌ల కామెంట్ చేశారు. సోమ‌వారం స‌జ్జ‌ల గుంటూరు జిల్లా జైలులో వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(MLC Lella Appi Reddy)ని పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి ప‌రామ‌ర్శించారు. అప్పిరెడ్డిపై అన్యాయంగా అక్ర‌మ కేసు పెట్టార‌న్నారు. ఏపీ ఎన్నిక‌ల తీరుపై సుప్రీం కోర్టు కూడా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింద‌ని గుర్తు చేశారు. దేశం మొత్తం దిగ్భ్రాంతికి గుర‌య్యేలా ఎన్నిక‌లు నిర్వ‌హించార‌న్నారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో బ్యాలెట్ బాక్స్ తీసుకుపోతున్న వ్య‌క్తిని అడ్డుకున్నందుకు లేళ్ల అప్పిరెడ్డిపై కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలులో పెట్టార‌ని స‌జ్జ‌ల (Sajjala Ramakrishna) తెలిపారు. చాలా రోజుల నుంచి సీఎం చంద్ర‌బాబు వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ల‌ను జైలుకు పంప‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకున్నార‌ని ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే కేసు పెట్టి కుట్ర చేస్తున్నార‌న్నారు. ఇక పోలీసులు యూనిఫామ్‌లో ఉండి తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల్లా ప‌ని చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

పోలీసులు బాధ్య‌త‌లు మ‌ర్చిపోయి టీడీపీకి కిరాయి సైన్యంగా మారార‌న్నారు. పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని విజ‌యం సాధించి టీడీపీ నేత‌లు మీసాలు మెలేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. రెండేళ్ల‌కు పైగా పాల‌న‌లో ఏం సాధించామో చెప్పి ఓట్లు అడ‌గాలి కానీ, చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌ను పోలీసుల‌కు కాంట్రాక్ట్ ఇచ్చేసి చేతులు దులుపేసుకున్నార‌ని విమ‌ర్శించారు. ఏపీలో ప్ర‌భుత్వం, పోలీసులు మాఫియా కంటే దారుణంగా త‌యారైంద‌ని, దీనికి ప్ర‌జ‌లే ఒక రోజు బుద్ధి చెప్తార‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : సైనికులపై హనీ ట్రాప్.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>