కలం, వెబ్డెస్క్: ఆదాయానికి మంచిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ (ACB) విచారణ ఎదుర్కొంటున్న మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి (Gundu Vani) వ్యవహారంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆమె అక్రమ మార్గాలు, అవినీతి ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం నుంచి వాణి ఇంటితో పాటు ఆఫీసు, బంధువులు, సన్నిహితులు, బినామీలకు సంబంధించిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
సోదాల్లో రెండు ఓపెన్ ప్లాట్లు, అత్తాపూర్లో ఒక ఇల్లు, మరో జీ+2 భవనం, మహబూబ్నగర్ జిల్లాలో వ్యవసాయ భూములు గుర్తించారు. వీటి అధికారిక విలువ సుమారు రూ.4.25 కోట్లుగా ఏసీబీ వెల్లడించింది. అదే విధంగా రూ.5.47 లక్షల నగదు, రూ.50 లక్షల విలువైన పెట్టుబడులు, రూ.1.30 కోట్ల షేర్లు, బ్యాంకు ఖాతాల్లో రూ.7.97 లక్షల నిల్వలు, 175.1 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైకులు, విలువైన వస్తువులు గుర్తించారు. మొత్తం ఆస్తుల విలువను రూ.6.76 కోట్లుగా అంచనా వేశారు. వీటి మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాణి (Gundu Vani) ఆస్తులపై మరింత పరిశీలన కొనసాగుతోందని, ఈ కేసును హైదరాబాద్లోని ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు ఏసీబీ వెల్లడించింది.
Also Read : రెండు చేతులతో రాత.. ఐదేళ్లకే జాతీయ రికార్డు!
Follow Us On: X(Twitter)

