ఎంజీయూ పరిశోధకురాలు దివ్యకు అరుదైన గుర్తింపు

కలం, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MGU) రసాయన శాస్త్ర విభాగానికి చెందిన యువ పరిశోధకురాలు కొమిరిశెట్టి దివ్యకు డాక్టరేట్‌ (PHD) లభించింది. ఆధునిక వైద్య రంగానికి, ఔషధ పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యమైన అంశంపై ఆమె చేసిన విశేష పరిశోధనకు విశ్వవిద్యాలయం ఈ పట్టాను ప్రదానం చేసింది. దివ్య తన పరిశోధనలో భాగంగా “స్టడీస్ ఆన్ బయోయాక్టివ్ నైట్రోజన్ హెటెరోసైకిల్స్: సింథసిస్ అండ్ బయోలాజికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ (ఆక్సజోల్-2-ఐల్) పిరిమిడిన్ అనలాగ్స్” అనే అంశంపై సమగ్ర పరిశోధన పూర్తి చేశారు. ఎంజీయూ రసాయన శాస్త్ర విభాగానికి చెందిన ప్రముఖ అధ్యాపకురాలు ఆచార్య వసంత మిట్టపెల్లి పర్యవేక్షణలో ఆమె ఈ సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారు.

ఈ పరిశోధనలో భాగంగా కొత్త ఆక్సజోల్–పిరిమిడిన్ అనలాగ్‌లను విజయవంతంగా సంశ్లేషణ చేసి, వాటి జీవక్రియాశీలతను సూక్ష్మంగా పరిశీలించారు. ముఖ్యంగా మానవాళిని వేధిస్తున్న ప్రాణాంతక క్యాన్సర్‌ వ్యాధి నిరోధకతలో ఈ సమ్మేళనాలు చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేయడంపై పరిశోధన ప్రధానంగా దృష్టి సారించింది. అన్ని దశల పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేసిన దివ్య, 2026 మే నెలలో విశ్వవిద్యాలయానికి తన సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. ఆమె పీహెచ్‌డీ పట్టా సాధించడం పట్ల విశ్వవిద్యాలయ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది.

ఈ సందర్భంగా ఎంజీయూ వైస్‌ ఛాన్సలర్‌ కాజా అల్లా హుస్సేన్, రిజిస్ట్రార్‌ అంజిరెడ్డి, పరిశోధన పర్యవేక్షకురాలు ప్రొఫెసర్‌ వసంత మిట్టపెల్లి, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, తోటి పరిశోధకులు, అధ్యాపకేతర సిబ్బంది దివ్యను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని అధునాతన పరిశోధనలు చేపట్టి సైన్స్‌, వైద్య రంగాలకు మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>