కలం, వెబ్ డెస్క్: విదేశీ గూఢచర్య ముఠాలు సైనికులపై హనీ ట్రాప్ (Honey Trap) లకే పరిమితం కావడం లేదని భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అశుతోష్ (Air Chief Marshal Ashutosh) దీక్షిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, ప్రైవేట్ రక్షణ కాంట్రాక్టర్లలో పని చేస్తున్న సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు తెలిపారు.
ఈ ముప్పును ఎదుర్కొనేందుకు భారత సైన్యం సాంకేతిక, సంస్థాగత చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే హనీ ట్రాప్ లు గూఢచర్యంలో ఒక భాగం మాత్రమేనని అంతకుమించి అనేక రకాలుగా గూఢచర్యంలో జరుగుతుందన్నారు.
సైబర్ దాడులు, వ్యక్తిగత సంబంధాలు, ఇతర మార్గాల ద్వారా దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కేవలం హనీ ట్రాప్లను మాత్రమే గూఢచర్యంగా భావించకూడదని, ఇది విస్తృతమైన భద్రతా సమస్య అని ఎయిర్ చీఫ్ స్పష్టం చేశారు. ఈ తరహా ముప్పులపై భద్రతా సంస్థలకు పూర్తి అవగాహన ఉందన్నారు.
పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన (Air Chief Marshal Ashutosh) వెల్లడించారు. భారత వైమానిక దళానికి చెందిన కీలక సైనిక కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు పబ్లిక్ ఇంటర్నెట్కు వేరుగా ఉన్నాయని దీక్షిత్ చెప్పారు. ఈ నెట్ వర్క్ లను ఎయిర్ – గ్యాప్డ్ విధానంలో నిర్వహిస్తున్నందున సైబర్ దాడులకు గురవడం కష్టమని తెలిపారు.
అయితే, గూఢచారులు సాంకేతిక వ్యవస్థలతో పాటు వాటిని నిర్వహించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో రక్షణ రంగానికి సంబంధించిన కీలక సమాచారం, పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం విదేశీ గూఢచర్య ముఠాలకు చిక్కకుండా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు దీక్షిత్ వివరించారు.
Also Read : సచిన్‌తో బ్రిటన్ యువరాజు గల్లీ క్రికెట్
Follow Us On : WhatsApp

