‎పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు

‎కలం, సూర్యాపేట: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి గాంచిన సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలోని శ్రీ పెద్దగట్టు (గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతర 2027 (Peddagattu Jatara) షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుండి 25వ తేదీ వరకు ఐదు రోజుల పాటు మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ‎జాతర ఆచారాల ప్రకారం ప్రధాన ఉత్సవాలకు పదిహేను రోజుల ముందుగా దిష్టి పూజ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 6న సూర్యాపేట మండలం చీకటాయపాలెం నుండి దేవరపెట్టెను తరలించి, ఫిబ్రవరి 7వ తేదీ ఆదివారం రాత్రి 11 గంటలకు అత్యంత భక్తిశ్రద్ధలతో దిష్టి పూజ జరుపుతారు.

అనంతరం ప్రధాన జాతర వేడుకలు ఫిబ్రవరి 21న ప్రారంభమవుతాయి. మొదటి రోజైన 21న సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుండి దేవరపెట్టెను పెద్దగట్టు పైకి తీసుకురావడం, గంపల ప్రదక్షిణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. రెండో రోజైన ఫిబ్రవరి 22న భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించుకుంటారు. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన ‘చంద్రపట్నం’ కార్యక్రమాన్ని మూడో రోజైన ఫిబ్రవరి 23న నిర్వహిస్తారు. నాలుగో రోజైన ఫిబ్రవరి 24న నెలవారం నిర్వహించి, అనంతరం దేవరపెట్టెను తిరిగి కేసారం గ్రామానికి తరలిస్తారు.

చివరి రోజైన ఫిబ్రవరి 25న ప్రత్యేక పూజలు, ముగింపు కార్యక్రమంతో ఐదు రోజుల మహాజాతర (Peddagattu Jatara) పరిసమాప్తమవుతుంది. రెండేళ్లకోసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరానుండటంతో, ఆలయ కమిటీ, అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు.

Also Read : భారత్ వ్యతిరేక సమ్మిట్‌.. రామచందర్ రావు ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>