జూన్‌ 15 నుంచి జులై 14 వరకు ఇంటింటి సర్వే: సజ్జల

కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జూన్‌ 15 నుంచి ప్రారంభం కానుందని వైఎస్ఆర్ సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పై (SIR) వైఎస్సార్సీపీ కీలక నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. జూన్‌ 15 నుంచి జులై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని స్పష్టం చేశారు. అనంతరం జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అవుతుందని చెప్పారు. ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్‌ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారని వివరించారు.

జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు..

జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కొనసాగే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అత్యంత కీలకమని పార్టీ శ్రేణులకు సజ్జల సూచించారు. అందుకే ఈ వ్యవహారంపై పార్టీ తరఫున ఏర్పాటు చేసిన కమిటీలు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలన్నారు. సెప్టెంబర్‌ వరకూ ప్రతి దశలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని చెప్పారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. బీఎల్‌వోలు, బీఎల్ఏల మధ్య సమన్వయం సమర్థవంతంగా ఉండాలన్నారు. ఈలోపు బీఎల్ఏలకు అవసరమైన ఓరియెంటేషన్‌, శిక్షణ ఇవ్వాలని సూచించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డ్రాఫ్ట్‌ స్థాయిలోనే జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఉండవన్నారు.

బీఎల్ఏలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలి..

ఎన్యూమరేషన్‌ పత్రాలు వచ్చేలోగానే బీఎల్ఏలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, ఓటర్లకు సంబంధించిన అన్ని ఆధార పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకునేలా ఓటర్లను చైతన్యపరచాలని సజ్జల (Sajjala) సూచించారు. అంతేకాక ఇప్పుడు జరుగుతున్నది SIR కాబట్టి ఒకసారి ఓటు తొలగిస్తే మళ్ళీ చేర్చడం కష్టమవుతుందన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. జూన్‌ 15న ఎస్‌ఐఆర్‌ ప్రారంభమయ్యేలోపు మరోసారి సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణపై చర్చిద్దామన్నారు.

Read Also: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>