భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది!

కలం, వెబ్ డెస్క్ : భారత ప్రజలు బుల్లెట్ ట్రైన్ రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హైస్పీడ్ రైలు కల తొందరలోనే నిజమవబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ అహ్మదాబాద్ – ముంబై మధ్య నడపడానికి సిద్ధంగా ఉన్న ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ (Bullet Train First Look) ను రైల్వే మంత్రిత్వ శాఖలో ఆవిష్కరించారు. ఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖ భవనం గేట్ నంబర్ 4 వద్ద ఈ హై-స్పీడ్ రైలు సెట్ ఫోటోను ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. భారత బుల్లెట్ సర్వీసుగా మారనున్న ఈ రైలు ఏరోడైనమిక్ డిజైన్ ఈ చిత్రంలో కనిపిస్తోంది.

కాగా, ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్‌ను కేంద్రం 2027 ఆగస్టు 15న ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా సొరంగం నిర్మాణం కోసం ముంబై తూర్పు శివారులోని విక్రోలి వద్ద పనులు ప్రారంభించినట్లు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత రోజే ఇండియన్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల కావడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>