మార్కెట్ యార్డు అభివృద్ధికి సహకారం : కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్

కలం, కరీంనగర్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ (Karimnagar) మార్కెట్ యార్డులో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం భారీ స్థాయిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, మార్కెట్ యార్డు అభివృద్ధికి నగరపాలక సంస్థ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. గన్ని బ్యాగుల సమస్యను మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, మార్కెట్ యార్డును శుభ్రంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

నగర (Karimnagar) పాలక సంస్థ తరఫున మార్కెట్ కమిటీకి నిరంతరం ఉంటామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న మాట్లాడుతూ.. రైతుల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. మేయర్ సహకారంతో యార్డులో లైటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు పరిశుభ్రత కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

Read Also: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>