Mobile Popup Ad
Mobile Popup Ad

విషాదం.. ఏనుగుల ఘర్షణలో మహిళ మృతి

కలం, వెబ్ డెస్క్ : కర్ణాటకలో (Karnataka) కొడగు జిల్లాలో విషాదం చేసుకుంది. రెండు ఏనుగుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కొడగు జిల్లాలోని దుబారే ఏనుగు శిబిరం (Dubare Elephant Camp)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దుబారే శిబిరంలోని ఉన్న ఏనుగులను స్నానం చేయించేందుకు మావటీలు కొలనులోకి వదిలారు. అయితే ఈ సమయంలో నీటిలో ఉన్న రెండు ఏనుగులు ఆకస్మాత్తుగా ఘర్షణకు దిగాయి. ఈ క్రమంలోనే ఓ ఏనుగు అదుపుతప్పి సమీపంలోని పర్యాటకుల వైపు వెళ్లింది.

దీంతో సదరు ఏనుగు చెన్నైకి చెందిన 33 ఏళ్ల పర్యాటకురాలిపై పడింది. తీవ్రంగా గాయపడిన పర్యాటకురాలిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. ఆహ్లాదం కోసం వచ్చిన తమ భద్రతపై దుబారే ఏనుగు శిబిరం (Dubare Elephant Camp) సిబ్బంది తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు.

Read Also: ‘ఆటే నా పొగరు’ .. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>