కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో సాయి భక్తుడు కర్ణబత్తుల సుదర్శన్ రావు నివాసంలో శనివారం సాయంత్రం సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సాయి పాదుకలు, సాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి శనివారం సాయి భక్తుల ఇళ్లల్లో వారి కోరిక మేరకు సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గత కొన్ని వారాలుగా నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు కందుల పండరి, కైలాష్పతి, వర్మ, రాంచంద్ర మాస్టర్, రాజు, శ్రీనివాస్, సుదర్శన్, కోల శంకర్, రాణి, శైలజ, కవిత, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

