కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆదివాసీ హక్కుల ఉద్యమ నేత చందా లింగయ్యను (Chanda Lingaiah) అంతర్జాతీయ స్థాయి గౌరవం వరించింది. సామాజిక సేవ, రాజకీయ నాయకత్వ రంగాల్లో ఆయన సేవలను గుర్తిస్తూ “యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్షిప్ అండ్ ఎక్స్‌లెన్స్” చందా లింగయ్యకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.
గతంలో ఉమ్మడి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, మాజీ ఎమ్మెల్యేగా సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవలందించిన చందా లింగయ్య ఆదివాసీల హక్కుల సాధన కోసం అహర్నిశలు శ్రమించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, లీడర్‌షిప్ రంగంలో ఆయన ప్రతిభను గుర్తించి యూనివర్సిటీ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

