రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు జమ అయ్యేది అప్పుడే!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి రెండో విడత రైతు భరోసా (Rythu Bharosa) నిధులను రెండో వారంలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరం పైబడిన రైతులకు రెండో విడతలో నిధులు విడుదల అవుతాయి. రెండో విడతలో ఐదు ఎకరాల వరకు ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2,650 కోట్ల సమీకరణకు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఏడాదికి ఎకరానికి రూ.12 వేల పెట్టుబడి సాయం అందించాలన్న హామీలో భాగంగా సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా (Rythu Bharosa) నిధుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 57.45 లక్షల ఎకరాలకు గానూ ప్రభుత్వం తొలి విడతలో రూ.3,446.94 కోట్ల నిధులను కేటాయించింది.యాసంగి సాగు కోసం ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో తక్కువ భూమి ఉన్న వారితో మొదలుపెట్టి విడతల వారీగా డబ్బులు వేసేవారు. దీనివల్ల ఎక్కువ భూమి ఉన్న రైతులు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఈసారి నిబంధనలను మార్చింది. భూమి ఎంత ఉన్నా సరే, ప్రతి రైతుకు తొలి విడతలో మొదటి ఎకరానికి సంబంధించిన రూ. 6 వేలు ఒకేసారి ఖాతాల్లో పడ్డాయి. ఇప్పుడు రెండో విడత డబ్బులు రాబోతున్నాయనే వార్త విని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: మార్కెట్‌లో క‌ల్తీ మామిడి పండ్లు.. సీపీ స‌జ్జ‌నార్ హెచ్చ‌రిక‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>