కలం, వెబ్ డెస్క్ : గ్రీన్ నుంచి జర్మనీకి వెళ్తున్న రెయిన్‌ఎయిర్ ఫ్లైట్‌లో (Ryanair Flight) ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా ఓ కిటీకి ఒక్కసారిగా ఉడిపోయింది. ఈ పరిణామంతో దాని పక్కనే ఉన్న ఓ ప్రయాణికులు సగం వరకు బయటకు వచ్చేశాడు. సీట్ బెల్ట్ ఊడకుండా ఉండడం, అతని భార్య, తోటి ప్రయాణికులు పట్టుకోవడంతో… అతను ప్రాణాలతో బయటపడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్‌లో తీవ్ర తలెత్తింది. ఈ క్రమంలోనే ఇంజిన్‌లోని కొంత భాగం ఊడి బలంగా తాకడంతో విమానం కిటికీ మొత్తం పగిలిపోయింది. ఇక గాలి వేగానికి కిటీకి పక్కనే కూర్చున్న సెర్బియాకు చెందిన 61 ఏళ్ల వ్యక్తి సగం వరకు విమానం నుంచి బయటకు వచ్చేశాడు. పక్కనే ఉన్న అతని భార్య, ఇతర ప్రయాణికులు ఆయనను వెనక్కి లాగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో విమానాన్ని గ్రీస్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు ప్రయాణికుడిన వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై రెయిన్‌ఎయిర్ సంస్థ (Ryanair Flight) దర్యాప్తు చేస్తోంది.
Read Also: ఇంటి అద్దె పెంచడం ఓనర్ ఇష్టమా.. చట్టం ఏం చెప్తోంది?
Follow Us On: Instagram

