కలం, స్పోర్ట్స్: 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ప్రశంసల వర్షం కురిపించాడు. మంగళవారం యూఏఈతో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 53 బంతుల్లో 204 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌పై స్పందించిన యువరాజ్, వైభవ్ ఒక ప్రత్యేకమైన ప్రతిభ గల ఆటగాడని ఎక్స్ వేదికగా కొనియాడాడు. కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదడం నిర్భయమైన బ్యాటింగ్‌కు నిదర్శనమని యువీ పేర్కొన్నాడు. ఇలాగే కష్టపడుతూ ప్రయాణాన్ని ఆస్వాదించాలని, అతని నుంచి అసలైన ఆట ఇంకా ముందుందని యువరాజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

