కుక్కల దాడిలో కృష్ణ జింక మృతి

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad)జిల్లా డొంకేశ్వర మండలంలోని డొంకేశ్వర్ గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఒక కృష్ణ జింక గాయాలతో పడి ఉండటాన్ని స్థానిక రైతులు నరేందర్, మల్లారెడ్డిలు గుర్తించారు. దీనిపై వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సదరు కృష్ణ జింక కుక్కల దాడికి గురై తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్ల‌డించారు. వెంటనే స్థానికుల‌ సహకారంతో జింకను సమీపంలోని డొంకేశ్వర్ పశువైద్యశాలకు తరలించారు.

అక్కడ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ నితేష్ కుమార్ జింకకు ప్రాథమిక చికిత్స అందించారు. జింక మృతి చెంద‌డంతో పశువైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించారు. జింక అధిక వేగంతో పరిగెత్తడం వల్ల కార్డియాక్ అరెస్ట్ సంభవించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం పంచనామా నిర్వహించి అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారం జింకకు వెటర్నరీ సర్జన్ డాక్టర్ నితేష్ కుమార్ రైతులు నరేందర్, మల్లారెడ్డి, అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్‌ల‌ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>