epaper
Tuesday, November 18, 2025
epaper

పాకిస్థాన్ మీడియాపై రష్యా తీవ్ర ఆగ్రహం..

పాకిస్థాన్‌(Pakistan)కు చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది ఫ్రాంటియర్‌ పోస్టు(The Frontier Point)పై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పత్రిక నిరంతరం రష్యా(Russia) విదేశాంగ విధానం, అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కు వ్యతిరేకంగా కథనాలు వండివారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌లోని రష్యా రాయబార కార్యాలయం తన అధికారిక ఎక్స్‌ ద్వారా వెల్లడించింది.

Russia అభ్యంతరం ఏమిటి?

“పాక్‌ ఆంగ్ల దినపత్రిక ‘ది ఫ్రాంటియర్‌ పోస్టు’ రష్యా వ్యతిరేకవైఖరిని అవలంభిస్తోంది. ఈ పత్రికను పాకిస్థాన్‌లోని పెషావర్ లో 1984లో స్థాపించారు. ప్రస్తుతం ఈ మీడియా సంస్థ వాషింగ్టన్ కేంద్రంగా నడుస్తోంది. ఈ పత్రికలో రష్యాకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నట్టు ఆ దేశం అభివర్ణిస్తోంది. అమెరికా ప్రోద్బలంతోనే ఇటువంటి వార్తలు వస్తున్నట్టు రష్యా అభిప్రాయపడుతోంది. ‘ది ఫ్రాంటియర్‌ పోస్టు పాకిస్థానీ పత్రికగా పిలవడం సరికాదు. ఈ పత్రిక అమెరికన్‌ మేనేజ్‌మెంట్‌ ఆధీనంలో నడుస్తోంది. ఇది రష్యా విదేశాంగ విధానం, నాయకత్వం, అధ్యక్షుడు పుతిన్‌ నిర్ణయాలను విమర్శించే వ్యాసాలను ఎంచుకుని ప్రచురిస్తోంది,” అని రష్యా విమర్శించింది.

అమెరికా అజెండాకు అనుకూలంగా కథనాలు రాస్తున్న ఈ పత్రిక, రష్యా విధానాలను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపుతోందని ఎంబసీ ఆరోపించింది. అఫ్గాన్‌ అంశాలపై ఎక్కువ కథనాలు ప్రచురించే ‘ది ఫ్రాంటియర్‌ పోస్టు’ రష్యా ఆధ్వర్యంలో జరిగే ‘మాస్కో ఫార్మాట్‌ ఆఫ్‌ కన్సల్టేషన్స్‌’ను పూర్తిగా విస్మరించిందని విమర్శించింది. “అఫ్గానిస్తాన్‌పై చర్చించేటప్పుడు రష్యా ప్రయత్నాలను ప్రస్తావించకపోవడం పత్రిక పక్షపాత ధోరణికి నిదర్శనం,” అని తెలిపింది.

అమెరికా అక్కసు

రష్యా విషయంలో అమెరికా అక్కసు వెళ్లగక్కుతోందని.. ప్రపంచాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తోందని రష్యా ఆరోపిస్తోంది. అమెరికన్‌ మీడియాలో వచ్చిన కొంతమంది విశ్లేషకుల వ్యాఖ్యలను ఉటంకిస్తూ రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనంగా, పతనం అంచున ఉన్నదిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని మాస్కో పేర్కొంది. దీనిపై రష్యా తీవ్రంగా స్పందించింది. “రష్యా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది. 2024లో జీడీపీ 4.1 శాతం వృద్ధి సాధించింది. యుద్ధ: ఇతర దేశాల ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే మేము పురోగతిని కొనసాగిస్తున్నాం. ఏ దేశ చరిత్రలోనూ ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇంత స్థిరంగా నిలబడిన ఉదాహరణ దొరకదు,” అని రష్యా ఎంబసీ వివరించింది.

పాకిస్థాన్ స్పందన ఏమిటి?

రష్యా ఆరోపణలపై పాకిస్థాన్ అధికారికంగా స్పందించలేదు. కానీ, కొందరు మీడియా ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. “ఒక స్వతంత్ర మీడియా స్వేచ్ఛను రష్యా అర్థం చేసుకోవాలి. పత్రికలు తమ విశ్లేషణలను ప్రచురించే హక్కు కలిగి ఉంటాయి,” అని కొందరు జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. రష్యా ఆరోపణలపై ది ఫ్రాంటియర్‌ పోస్టు’ పత్రిక ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మరి ఈ వివాదం రష్యా, పాకిస్థాన్ సంబంధాల మధ్య ఎటువంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.

Read Also: బీఆర్ఎస్ నేతల ఇండ్లల్లో పోలీసుల సోదాలు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>