జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ఎన్నికలో హోరాహోరీగా తలపడుతున్నాయి. డబ్బు, మద్యం ఏరులై పారించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా బీఆర్ఎస్ నేతల ఇండ్లల్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Marri Janardhan Reddy), ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇండ్లల్లో డబ్బును దాచి ఓటర్లకు పంచిపెట్టేందుకు సిద్ధమైనట్టు పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు.
ప్రత్యేక బృందాలు బీఆర్‌ఎస్(BRS) నేతల ఇళ్లపై దృష్టి సారించాయి. మోతీనగర్‌లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి(Marri Janardhan Reddy) నివాసం వద్ద పోలీసులు శుక్రవారం తెల్లవారుజామునే సోదాలు ప్రారంభించారు. అదే సమయంలో ఎమ్మెల్సీ రవీందర్‌రావు ఇంటిని కూడా పోలీసులు తనిఖీ చేశారు. స్థానిక ఎస్సీబీ, టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో నగదు నిల్వచేసారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. అధికారులు ఇంట్లోని ప్రతి గది, వాహన గ్యారేజీలు, కార్యాలయ గదులను పరిశీలించినట్టు తెలుస్తోంది. ఈ సోదాల సమయంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఏమైనా నగదు లేదా పత్రాలు స్వాధీనం చేసుకున్నారా? అన్న విషయంపై అధికార వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఎన్నికల వ్యవహారాల నిబంధనల ప్రకారం అనుమానాస్పద లావాదేవీలపై కఠినంగా వ్యవహరించాలనే సూచనలతోనే ఈ సోదాలు జరుగుతున్నాయని వర్గాలు చెబుతున్నాయి.
ఇక బీఆర్‌ఎస్ నేతలు మాత్రం ఈ సోదాలను రాజకీయ వేధింపులుగా అభివర్ణిస్తున్నారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతలపై ఇలాంటి చర్యలు చేపట్టడం అనైతికమని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చేపట్టిన సాధారణ తనిఖీ చర్య మాత్రమేనని స్పష్టం చేశారు.
Read Also: ‘శివ’ ఎందుకంత ప్రత్యేకం?
Follow Us on: Instagram

