Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మాతలు జడ్జిమెంట్లు ఎందుకిస్తున్నారు: ఐబొమ్మ రవి తండ్రి..

ఐబొమ్మ(ibomma) రవి అంశం రోజురోజుకు కీలకంగా మారుతోంది. వేల సినిమాలను పైరసీ చేసిన కేసులో ఇమ్మడి రవిని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అతడిపై సినీ నిర్మాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నిర్మాత.. రవిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా అతని వ్యాఖ్యలను ఇమ్మడి రవి తండ్రి అప్పారావు(Immadi Apparao) తీవ్రంగా ఖండించారు. అసలు రవి విషయంలో జడ్జిమెంట్లు ఇచ్చే హక్కు నిర్మాతలకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.

ibomma | నిర్మాతలను కానీ, వాళ్ల పిల్లలను కానీ ఎన్‌కౌంటర్ చేస్తే వాళ్లకి ఆ బాధ తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవి విషయంలో పోలీసుల విచారణ జరుగుతుందని గుర్తు చేశారు. విచారణలో ఉన్న విషయంలో నిర్మాతలు ఎందుకు జడ్జిమెంట్లు ఇస్తున్నారని ప్రశ్నించారు. ‘‘వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసి ప్రజలపై భారం మోపుతోంది నిర్మాతలు. పోలీసుల కస్టడీలో ఉన్న రవి నాతో రెండు సార్లు మాట్లాడాడు’’ అని అప్పారావు చెప్పారు. రవి విషయంలో న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పారు.

Read Also: ఎట్టకేలకు మొదలైన స్పిరిట్.. ఫస్ట్ క్లాప్ ఎవరు కొట్టారంటే..

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>