రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో తెలుగు యువకుడి మృతి

కలం, వెబ్ డెస్క్ : రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో (Russia – Ukraine War) జరిగిన డ్రోన్ దాడిలో ఒడిశా-ఆంధ్ర సరిహద్దు (Odisha-Andhra Border) ప్రాంతానికి చెందిన యువకుడు ఎ. రామయ్య మరణించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని, అలాగే రామయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి సహాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని భారత్‌కు రప్పించే ప్రక్రియపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. గంజాం జిల్లా కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ అధికారులు, భారత రాయబార కార్యాలయం.. మాస్కోతో సమన్వయం చేస్తూ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనతో విదేశాలలో పనిచేస్తున్న భారతీయుల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.

Read Also: బోటు మనదే, వేట మనదే.. ఏపీ తీర ప్రాంతాలపై బాబు కీలక వ్యాఖ్యలు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>