కామారెడ్డి బస్టాండ్ వద్ద టెన్షన్.. బస్సులను అడ్డుకున్న కార్మికులు

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. కామారెడ్డి (Kamareddy) లో బస్సులను అడ్డుకున్న కార్మికులు ఉదయం నుంచీ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే అధికారులు కార్మికులతో సమ్మె చేసుకోవాలని.. కానీ జనాల ఇబ్బందుల దృష్ట్యా ఒకట్రెండు బస్సులను నడిపిస్తూ.. అత్యవసరం ప్రయాణాలకు ఇబ్బందులు తొలగించేందుకు సహకరించాలని కోరారు. దీంతో సరేనని ఒప్పుకున్నారు. అద్దె డ్రైవర్ లతో రెండు బస్సులు పంపించాక.. మరో నాలుగు బస్సులను బయటకు తీయించే ప్రయత్నం చేశారు.

దీంతో అధికారుల తీరును నిరసిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. పోలీసుల బందోబస్తు నడుమ బస్సులను బయటకు పంపించే ప్రయత్నాన్ని కార్మికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులకు, అధికారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పోరాటం సాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని వెల్లడించారు.

Read Also: లీగల్ బ్యాటిల్ టు స్ట్రీట్ ఫైట్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ స్ట్రాటెజీ…

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>