భారత నౌక దిగ్బంధం.. ఇరాన్ మళ్లీ షాక్!

కలం, వెబ్ డెస్క్: హర్మూజ్ (Hormuz) జలసంధిలో భారత నౌకను (Indian Tanker) ఇరాన్ ఆర్మీ అడ్డుకుంది. దుబాయ్ నుంచి గుజరాత్ పోర్టుకు వస్తున్న ఈ నౌక.. హర్మూజ్ నుంచే రావాల్సి ఉంటుంది. జలసంధిలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే IRGC కమాండర్లు నౌకను దిగ్బంధించారు. ఈ మేరకు నౌకలోని సిబ్బంది, పోర్టు అధికారులకు సమాచారం అందించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మొన్న కాల్పులు.. నేడు ఆపేశారు..

హర్మూజ్ జలసంధిలో భారత నౌకలకు (Indian Tanker) అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గత వారం నౌకపై కాల్పులు జరిపిన IRGC సిబ్బంది.. ఈ రోజు మరో నౌకను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ పరిణామాలపై ఇటీవలే.. ఢిల్లీలోని ఇరాన్ రాయబారిని పిలిపించి కేంద్ర ప్రభుత్వం నిరసన సైతం వ్యక్తం చేసింది. మరోసారి ఇలా జరగకుండా.. తమ నేతలకు సమాచారం అందిస్తామని రాయబారి చెప్పిన మూడు రోజులకే మరో నౌకను ఇరాన్ బంధించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో నౌకల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Read Also: మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>