Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం రేవంత్‌కు ఆర్టీసీ జేఏసీ అభినందనలు.. మే 1న భేటీ

కలం, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె నివారణ కోసం ప్రభుత్వం చొరవ తీసుకుని డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జేఏసీ ప్రతినిధులు, కార్మిక సంఘాల నేతలు అభినందించనున్నారు. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మే డే రోజునే ముఖ్యమంత్రిని కలిసి ముచ్చటించనున్నారు. కీలకమైన మూడు డిమాండ్ల విషయంలో చూపిన చొరవ, ఇచ్చిన హామీలకు కృతజ్ఞతగా సీఎంను అభినందించనున్నారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో మే డే రోజున మధ్యాహ్నం 3.00 గంటలకు సీఎంతో భేటీ కానున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఎన్నికలు జరిపించడం, ఆర్టీసీ కార్మికులకు 11% పీఆర్సీ ప్రకటనతో పాటు ఇతర డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలం వ్యక్తం చేసినందుకు కార్మికులు సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అభినందించి ధన్యవాదాలు తెలియజేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>