Mobile Popup Ad
Mobile Popup Ad

విషాదం.. పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ కుప్పకూలిన నవ వధువు!

కలం, వెబ్ డెస్క్ : బంధువుల వివాహ వేడుకకు హాజరై ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఓ నవ వధువు అనుహ్యంగా కానరాని లోకాలకు వెళ్లిపోయింది. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ లోని జలోర్ జిల్ల బాగోడాలో జరిగిన పెళ్లి వేడుకలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా (Viral Video) మారింది.

వివరాల్లోకి వెళ్తే.. దీపిక అలియాస్ దీపు రాజ్‌పురోహిత్ (22) తన పుట్టిల్లు మోర్సిమ్ లోని బంధువుల పెళ్లికి హాజరైంది. ఈ క్రమంలోనే డీజే పాటలకు డ్యాన్స్ చేస్తున్న వేళ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే చనిపోయింది. మహిళ గుండెపోటు కారణంగానే చనిపోయిందని వైద్యులు తేల్చారు. కాగా, నాలుగు నెలల క్రితమే దీపికకు వివాహమైంది. అప్పటిదాకా సంతోషంగా గడిపిన దీపిక మృతి చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>