Mobile Popup Ad
Mobile Popup Ad

సంగారెడ్డి, మెదక్ బస్టాండ్‌ల వద్ద ఉద్రిక్తత

కలం మెదక్ బ్యూరో: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారుల కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె (RTC Strike) మొదలైంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలోని సుమారు 38 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. సిటీ బస్సులు, జిల్లాల సర్వీసులు బంద్ కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు మొదలయ్యాయి. సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, ఆర్టీసీ అధికారులతో కలిసి బస్టాండుల నుంచి ప్రైవేట్ అద్దె బస్సులను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో.. సంగారెడ్డి (Sangareddy), మెదక్ (Medak) బస్టాండ్‌ల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు సహాయంతో బస్టాండ్‌ల నుంచి ప్రైవేటు అద్దె బస్సు సర్వీస్ ప్రారంభించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నం ఘర్షణకు దారితీసింది. అద్దె బస్సులను బస్టాండ్ నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని, బస్సు సర్వీసులు నిలిపివేయాలని బస్సుకు అడ్డంగా వెళ్ళి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం నెలకొని, తోపులాట జరిగింది. దీంతో అధికారులు ఆర్టీసీ కార్మికులను చెదరగొట్టి పోలీసు ఎస్కార్ట్ వాహనాలతో బస్సులను నడుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>