Mobile Popup Ad
Mobile Popup Ad

రేపటి నుంచే వేసవి సెలవులు.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు (Summer Holidays) ప్రకటించారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. తిరిగి జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని విద్యాశాఖ వెల్లడించింది. విద్యా సంవత్సరం చివరి రోజు కావడంతో విద్యార్థులకు సెలవుల పట్ల స్పష్టమైన ఆదేశాలు అందాయి.

సెలవుల నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సెలవుల్లో సరదా కోసం చెరువులు, కాలువలు, నదుల వద్దకు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, అటువంటి ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ప్రమాదాల నివారణకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

విద్యా సంవత్సరం ముగిసేలోపు అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రతా చర్యలపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఎండల నుంచి రక్షణ పొందడం, ప్రమాదకరమైన నీటి వనరులకు దూరంగా ఉండటం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పాఠశాల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>