Mobile Popup Ad
Mobile Popup Ad

ఉమ్మడి మెదక్‌లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

కలం మెదక్ బ్యూరో : ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో ఆర్టీసీ సమ్మె (RTC Strike) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలోని పలు ఆర్టీసీ డిపోల వద్ద కార్మికులు ఉదయం నుంచే ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలు చేపట్టారు. ఉమ్మడి మెదక్ (Medak) జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది ఆర్టీసీ డిపోల పరిధిలో మొత్తం 1,043 మంది కండక్టర్లు, 869 మంది డ్రైవర్లు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో వారు విధులు బహిష్కరించి డిపో గ్యారేజీల ఎదుట నిరసన తెలిపారు. సమ్మె కారణంగా బస్సు సర్వీసులు ప్రభావితమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తాత్కాలిక సిబ్బందిని నియమించి బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ విజయ భాస్కర్ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>