కలం, వెబ్ డెస్క్ : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ (RTC Driver Shankar Goud) మృతితో వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో హైటెన్షన్ నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ను వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని మహేశ్వరం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కాన్వాయ్ ను ముందుకు పోనివ్వకపోగా ఒకే వాహనం మాత్రమే వెళ్లాలని బండి సంజయ్ ను పోలీసులు కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ డెడ్ బాడీకి నివాళి అర్పించడానికి వెళితే ఇబ్బంది ఏమిటని బండి సంజయ్ పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి అభ్యంతరం తెలపడంతో నర్సంపేట సమీపంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
అనంతరం బండి సంజయ్ (Bandi Sanjay) ముత్తోజిపేట కు బయలుదేరి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు. ఈ క్రమంలో మృతదేహాన్ని నర్సంపేట బస్ డిపో దగ్గరకు తరలించాలని ఆర్డీసీ కార్మికులు, బండి సంజయ్ డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మాత్రం ముత్తోజీపేటలో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. డెడ్‌బాడీని బలవంతంగా నర్సంపేటకు తరలించేందుకు బండి సంజయ్‌తో పాటు ఆయన వెంట ఉన్న బీజేపీ కార్యకర్తలు, ఆర్టీసీ సిబ్బందిలో కొందరు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఆ ప్రయత్నాలను ప్రతిఘటిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే శంకర్ గౌడ్ మృతదేహాం అత్యక్రియలు ముత్తోజిపేటలోనే (Muthojipet) చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ప్రభుత్వం తరపున ఆర్డీవో శంకర్ గౌడ్ భౌతికకాయాన్ని సందర్శించి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Read Also: ఇష్టంలేని గర్భంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

