కలం, కరీంనగర్: లయన్స్ క్లబ్ (Lions Club) ఆధ్వర్యంలో వెదిర గ్రామస్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం 30 మందికి ఆపరేషన్లు అవసరమని సిఫార్సు చేయడంతో వారిని రేకుర్తి ఐ హాస్పిటల్కు తరలించి, శస్త్ర చికిత్సలు చేశారు. అనంతరం, వారికి పండ్లు పంపిణీ చేసి తిరిగి సొంతూరికి పంపించినట్లు నిర్వాహకులు తెలిపారు. డిజైన్ ఛైర్మన్ ఆర్.ఎస్.పి రెడ్డి, అధ్యక్షులు బండ కిషన్ రెడ్డి, సభ్యులు సత్యనారాయణ మూర్తి రామచంద్రం, బండ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

