కీలక దశకు ఆర్టీసీ చర్చలు.. మరో గంటలో తుది నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ కార్మిక సంఘాల (RTC Unions) సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఐఏఎస్ అధికారుల కమిటీతో కార్మిక నేతలు జరుపుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం లంచ్ బ్రేక్ కొనసాగుతోంది. మరో గంటలో అధికారులతో చర్చల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ సమావేశం అనంతరం కార్మిక సంఘాల నేతలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), ఉన్నతాధికారులతో కలిసి మరోసారి భేటీ కానున్నారు. ప్రభుత్వ పెద్దలతో జరిగే ఈ మలిదశ చర్చల్లో కార్మికుల ప్రధాన డిమాండ్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Read Also: ఇష్టంలేని గర్భంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>