Mobile Popup Ad
Mobile Popup Ad

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అరెస్ట్

కలం, వరంగల్ బ్యూరో : నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకోగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళుతున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy)తో పాటు మాజీ ఎంపీలు బోయిన్ పల్లి వినోద్ కుమార్, మాలోతు కవితలను రఘునాథపల్లి పోలీసులు కోమళ్ల టోల్​ గేట్​ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రఘునాథపల్లి సిఐ ఆఫీస్ కు తరలించారు. సీఐ శ్రీనివాస్ రెడ్డి తో పాటు నర్మెట సిఐ అబ్బయ్య పలువురు ఎస్సైలు ఆమెను అదుపులోకి తీసుకొని ఆఫీసులో ఉంచారు. నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీసులు నల్లగొండ వైపునకు తరలించారు.

Read Also: ఆత్మహత్యలొద్దు.. తెగించి పోరాడుదాం: కూనంనేని పిలుపు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>